ఉదయనిధికి కోర్టు సమన్లు జారీ !

Telugu Lo Computer
0


డీఎంకే పార్టీ నేత, తమిళనాడు క్యాబినెట్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ 'సనాతన ధర్మం'పై  చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై బెంగళూర్ కోర్టు ఉదయనిధికి సమన్లు జారీ చేసింది. బెంగళూర్ వాసి పరమేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు బెంగళూరులోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టు మంత్రికి సమన్లు జారీ చేసింది. మార్చి 4న జరగనున్న విచారణకు వ్యక్తిగతంగా హాజరుకావాలని కోర్టు సమన్లలో పేర్కొంది. ఉదయనిధి స్టాలిన్ గతేడాది ఓ కార్యక్రమం మాట్లాడుతూ.. సనాతన ధర్మం డెంగ్యూ, మలేరియాతో పోల్చాడు, దాన్ని నిర్మూలించాని పిలుపునిచ్చాడు. సెప్టెంబరు 2023లో జరిగిన ఒక సదస్సులో ఉదయనిధి స్టాలిన్ మాట్లాడుతూ, సనాతన ధర్మం సామాజిక న్యాయం మరియు సమానత్వానికి విరుద్ధమని, దానిని నిర్మూలించాలని అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)