ఆంధ్రప్రదేశ్ లో ఫిరాయింపు ఎమ్మెల్యేలకు మళ్లీ నోటీసులు

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సమయం దగ్గర పడిన నేపథ్యంలో అన్ని రాజకీయ పార్టీలు స్పీడ్ పెంచుతున్నాయి. వచ్చే ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా అనేక వ్యూహాలు రచిస్తున్నాయి. ప్రత్యర్థి పార్టీలను ఇరుకున పెట్టే విధంగా ఎత్తుకు పైఎత్తులు వేస్తున్నాయి. ఇక త్వరలో జరగబోతున్న రాజ్యసభ ఎన్నికల కు సంబంధించి అభ్యర్థులను నిలబెట్టే విషయంలో ప్రధాన ప్రతిపక్షం టిడిపి తమకు బలం లేకపోయినా, ఎన్నికల్లో పోటీ చేసేందుకు సిద్ధమవుతుండడంతో టిడిపి వ్యూహాలకు చెక్ పెట్టే విధంగా అధికార పార్టీ వైసీపీ పార్టీ ఫిరాయింపులకు పాల్పడ్డ ఎమ్మెల్యేలకు స్పీకర్ ద్వారా నోటీసులు జారీ చేయించింది. ముఖ్యంగా అనర్హత పిటిషన్ వ్యవహారం లో వైసీపీ నుంచి ఫిరాయించిన ఎమ్మెల్యేలకు  స్పీకర్ తమ్మినేని సీతారాం నోటీసులు జారీ చేశారు. ఈనెల 12వ తేదీన దీనిపై విచారణకు హాజరుకావాలని నోటీసుల్లో స్పీకర్ పేర్కొన్నారు. ఈసారి పూర్తిస్థాయిలో పార్టీ ఫిరాయింపులపై వివరణ తీసుకున్న దానిపై నిర్ణయం ప్రకటించే ఆలోచనతో స్పీకర్ ఉన్నారు. 2019 అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ నుంచి గెలిచిన ఎమ్మెల్యేలు మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆనం రామ నారాయణ రెడ్డి ,ఉండవల్లి శ్రీదేవి, కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పార్టీ ఫిరాయించిన నేపథ్యంలో వీరికి స్పీకర్ నోటీసులు జారీ చేశారు.   వీరు ఈనెల 12వ తేదీన విచారణకు హాజరై తమ వివరణ ఇస్తే దానికి అనుగుణంగా స్పీకర్ నిర్ణయం వెలువడాల్సి ఉంది. అయితే వారు ఈ నోటీసులకు స్పందించి విచారణకు హాజరవుతారా లేదా అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)