బస్సులు, భారీ వాహనాల్లోనూ సీట్‌ బెల్ట్‌ తప్పనిసరి చేయండి !

Telugu Lo Computer
0


స్సులు సహా అన్ని భారీ వాహనాల్లో సీటు బెల్ట్‌ వినియోగాన్ని తప్పనిసరి చేయాలని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వశాఖను అంతర్జాతీయ రహదారి సమాఖ్య కోరింది. రోడ్డు ప్రమాదాలు తగ్గించడానికి ఈ నిర్ణయం ఉపకరిస్తుందని పేర్కొంది. ఈ మేరకు ఆ శాఖకు ఓ లేఖ రాసింది. 'బస్సు ప్రమాదాల వల్ల ఎంతోమంది అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. సీటు బెల్ట్‌ ఉంటే వారిలో చాలామంది ప్రమాదం నుంచి బయటపడేవారు. బస్సుల్లోనూ సీట్‌ బెల్ట్‌ ఉండాలి. వాటి వినియోగాన్ని తప్పనిసరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది' అని కేంద్ర రవాణాశాఖకు రాసిన లేఖలో ఐఆర్‌ఎఫ్‌ ప్రెసిడెంట్‌ కపిల కోరారు. నేషనల్ హైవే ట్రాఫిక్ సేఫ్టీ అడ్మినిస్ట్రేషన్ 2021 నివేదిక ప్రకారం.. అమెరికాలో బస్సు ప్రమాదాల కారణంగా కేవలం 14 మంది మాత్రమే ప్రాణాలు కోల్పోయారు. చైనా (2022)లో బస్సు ప్రమాదాల్లో 215 మరణించారు. ప్రజా రవాణా విషయంలో ఆయా దేశాలు అవలంబిస్తున్న విధానాలే దీనికి కారణమని కపిల పేర్కొన్నారు. కఠినమైన భద్రతా ప్రమాణాలను పాటిస్తూ అభివృద్ధి చెందుతున్న, అభివృద్ధి చెందిన దేశాలు అద్భుతమైన ఫలితాలను సాధించాయని తెలిపారు. భారత్‌లో బస్సుల్లో ఈతరహా ప్రమాణాలను సరిగ్గా పాటించకపోవడంతో పాఠశాలకు వెళ్లే పిల్లలు, అమాయకుల జీవితాలు ప్రమాదంలో పడుతున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)