సన్‌ఫ్లవర్‌ రైతులు తొందరపడి అమ్ముకోవద్దని మంత్రి తుమ్మల సూచన !

Telugu Lo Computer
0


తెలంగాణలోని సన్‌ఫ్లవర్‌ రైతులకు వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కీలక సూచన చేశారు. రైతులు తొందరపడొద్దని, క్వింటా రూ.6,760 కంటే తక్కువ ధరకు విక్రయించొద్దని సూచించారు. కనీస మద్దతు ధర కల్పించాలని మార్కెటింగ్‌, మార్క్‌ఫెడ్‌ అధికారులకు మంత్రి ఆదేశాలు జారీ చేశారు. శుక్రవారం నుంచి కొనుగోలు కేంద్రాలు ప్రారంభించాలన్నారు. మరోవైపు మంత్రి తుమ్మలకి మాజీ మంత్రి, భారాస ఎమ్మెల్యే హరీశ్‌రావు బహిరంగ లేఖ రాశారు. సన్‌ఫ్లవర్‌ రైతులు మద్దతు ధర లేక నష్టపోతున్నారని అన్నారు. ''ఈ ఏడాది సన్‌ఫ్లవర్‌ మద్దతు ధర క్వింటాకు రూ.6,760. కానీ, రైతులు రూ.5 వేలలోపే అమ్ముకుంటున్నారు. దీంతో రూ.2వేల వరకు నష్టపోతున్నారు. మా ప్రభుత్వంలో మద్దతు ధరలు ఇచ్చి రైతులను ఆదుకున్నాం''అని లేఖలో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)