ఎల్‌కే అద్వానీకి భారతరత్న

Telugu Lo Computer
0

బీజేపీ కురువృద్ధుడు లాల్ కృష్ణ అద్వానీ భారతరత్న పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ విషయాన్ని ప్రధాని మోడీ ట్విట్టర్‌ ద్వారా తెలియజేశారు. 'అద్వానీ గొప్ప రాజనీతిజ్ఞుడని, దేశాభివృద్ధిలో ఆయన సేవలు ఎనలేనివని కొనియాడిన మోడీ ఆయనకు భారతరత్న ఇవ్వనున్నట్లు పంచుకోవడం చాలా సంతోషంగా ఉందని, తాను ఆయనతో మాట్లాడానని ఈ గౌరవం లభించినందుకు అభినందనలు తెలిపానని' మోడీ తన ట్వీట్‌లో పేర్కొన్నారు. అద్వానీ 1927 నవంబర్ 8న పాకిస్తాన్‌లోని కరాచీలో జన్మించారు. కిషన్ చంద్ అద్వానీ, జ్ఞానీదేవి తల్లిదండ్రులు. భార్య కమలా అద్వానీ (2016 లో కన్నుమూశారు). ఆయనకు ప్రతిభా అద్వానీ, జయంత్ అద్వానీ ఇద్దరు పిల్లలు. అద్వానీ రాజకీయ జీవితానికి వస్తే 1970 లో తొలిసారి రాజ్యసభకు ఎన్నికయ్యారు. 1977 లో మొరార్జీ దేశాయ్ ప్రభుత్వంలో సమాచార ప్రసార శాఖా మంత్రిగా పనిచేశారు. 1998 లో వాజపేయి ప్రభుత్వంలో హోంమంత్రిగా వ్యవహరించారు. 2002లో ఉప ప్రధానిగా నియమితులయ్యారు. 2007 లో బీజేపీ ఆయనను ప్రధాని అభ్యర్ధిగా నిర్ణయించింది. 2008 లో 'మై కంట్రీ.. మై లైఫ్' పేరుతో తన బయోగ్రఫీని రాసారు. గతంలో పద్మవిభూషణ్ పురస్కారం అందుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)