బీఆర్ఎస్ కు రాజీనామా చేసిన జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్

Telugu Lo Computer
0


గ్రేటర్ హైదరాబాద్ లో బీఆర్ఎస్ పార్టీకి భారీ షాక్ తగిలింది. జీహెచ్ఎంసీ మాజీ డిప్యూటీ మేయర్, బోరబండ కార్పొరేటర్ బాబా ఫసియుద్దీన్ బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. కేటీఆర్ తీరుపై గత కొంతకాలంగా బాబా తీవ్ర అసహనంతో ఉన్నారు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జీ దీపాదాస్ మున్షి నేతృత్వంలో హస్తం పార్టీలో చేరారు. ఈ సందర్భంగా బాబా ఫసియుద్దీన్ మాట్లాడుతూ ఉద్యమకారులకు పార్టీలో ప్రాధాన్యం లేదంటూ ఆవేదన వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే మాగంటి గోపీనాథ్ తో తనకు ప్రాణహాని ఉందని చెప్పినా అధిష్టానం పట్టించుకోలేదని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)