బాల్క సుమన్ కు పోలీసుల నోటీసులు !

Telugu Lo Computer
0


తెలంగాణలో బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ కు మంచిర్యాల పోలీసులు నోటీసులు జారీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన నేపథ్యంలో కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. కాంగ్రెస్ నేతల ఫిర్యాదు మేరకు ఇప్పటికే కేసు నమోదు చేసిన పోలీసులు బాల్క సుమన్ కు తాజాగా నోటీసులు జారీ చేశారు. అయితే ఇటీవల మంచిర్యాల జిల్లాలో నిర్వహించిన పార్లమెంట్ స్థాయి సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా చెప్పు చూపిస్తూ బాల్క సుమన్ తీవ్రస్థాయిలో మండిపడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనపై కాంగ్రెస్ నేతలు పోలీసులకు ఫిర్యాదులు చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)