నడిరోడ్డుపై ప్రియురాలిని నరికి చంపిన ప్రియుడు

Telugu Lo Computer
0


తెలంగాణలోని నిర్మల్ జిల్లా ఖానాపూర్ పరిధిలోని శివాజీనగర్‌లో నడిరోడ్డుపై ఓ ప్రేమికుడు బరి తెగించాడు. పెళ్లికి నిరాకరించిందని ప్రియురాలిని గొడ్డలితో నరికి చంపాడు. ఈ ఘటనలో మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని, పరిస్థితిని సమీక్షించారు. గాయపడ్డ వారిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)