బైక్ పై గర్ల్‌ఫ్రెండ్ బదులు బొమ్మను పెట్టుకొని తిరిగిన యువకుడు !

Telugu Lo Computer
0


వర్ ను బైక్ పై తీసుకెళ్లడం కామన్. అయితే గర్ల్‌ఫ్రెండ్ లేని వారు సింగిల్ అని చెప్పుకుంటూ తిరుగుతున్నారు. కానీ ఓ యువకుడు మాత్రం ఇదే విషయంపై తెగ ఆలోచించాడు. అతడికి ఓ ఆలోచన తట్టింది. అనుకున్నదే తడువుగా దానిని ఆచరణలో పెట్టాడు. గర్ల్‌ఫ్రెండ్ లేకపోవడంతో ఓ బొమ్మకు డ్రస్ వేసి, అందంగా ముస్తాబు చేశాడు. తర్వాత ఆ బ్యూటిపుల్ బొమ్మను తన బైక్ పై వెనకాల కూర్చోబెట్టుకుని ఊరంతా తిరిగాడు. అయితే చాలా మంది నిజంగానే వాళ్లు లవర్స్ అనుకున్నారు. అయితే కాస్త తీక్షణంగా పరిశీలించగా అది బొమ్మని తెలిసి షాక్ అయ్యారు. తర్వాత ఆ యువకుడి బైక్ వద్దకు చేరుకుని అందరూ నవ్వుకున్నారు. ఈ వీడియో ప్రస్తుతం ఇంటర్నెట్ ను షేక్ చేస్తోంది. అంతేకాకుండా ఈ వీడియోపై లైక్స్, కామెంట్స్ వర్షం కురుస్తోంది. 'వాటెన్ ఐడియా సర్జీ'.. అని కొందరు, ''మీ జంట చాలా బాగుంది బ్రదర్''.. అంటూ మరికొందరు కామెంట్స్ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)