సోషల్ మీడియా పోస్టులపై సైబర్ క్రైమ్ పోలీసులకు షర్మిల ఫిర్యాదు !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో తనను కించపరిచేలా పోస్టులు పెడుతున్నారంటూ ఆంధ్రప్రదేశ్  పీసీసీ అధ్యక్షురాలు  వైఎస్ షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. నటి శ్రీరెడ్డి, వర్ర రవీందర్ రెడ్డితో పాటు మరికొంతమంది ఉన్నారని ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు. మొత్తం ఎనిమిది మందిపై షర్మిల సైబర్ క్రైమ్ పోలీసులకు ఫిర్యాదు చేస్తూ, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఆమె పిర్యాదుపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. ఆ ఎనిమిది మందిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. కాగా సోషల్ మీడియాను కేంద్రంగా చేసుకొని తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని తనను మానసికంగా వేధిస్తున్నారంటూ.. వైఎస్ షర్మిల ఆ ఫిర్యాదులో పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)