కాపాడమని వేడుకున్న చిన్నారి గొంతు మూగబోయింది !

Telugu Lo Computer
0


గాజాలో ఓ ఆరేళ్ల చిన్నారి కథ విషాదాంతమైంది. చుట్టూ యుద్ధం తాలుకు విధ్వంసపు ఆనవాళ్లు, మృతదేహాల మధ్య ఒంటరిగా మిగిలిపోయిన ఆమె గొంతు చివరకు మూగబోయింది. తనను కాపాడాలంటూ ప్రాధేయపడినప్పటికీ యుద్ధ పరిస్థితులు కనికరించలేదు. ఎట్టకేలకు రెడ్‌క్రెసెంట్‌ సిబ్బంది ఆమె ఆచూకీ కనుగొనగా మృతదేహమై కనిపించింది. ఇజ్రాయెల్‌ దాడుల కారణంగా గాజా సిటీలో ధ్వంసమైన కారులో చిక్కుకుపోయిన 'హింద్‌ రజాబ్‌' అనే బాలిక మరణం అందరినీ కలచివేస్తోంది. ఇజ్రాయెల్‌ సేనలే దీనికి కారణమని హమాస్‌ ఆరోగ్య విభాగం ఆరోపించింది. గాజా సిటీపై దాడుల నేపథ్యంలో సురక్షిత ప్రాంతానికి తరలివెళ్లేందుకుగానూ హింద్‌ రజాబ్‌ జనవరి 29న ఓ బంధువుల కారులో ఎక్కింది. అయితే, మార్గమధ్యలో ఆ కారు కాస్త ఇజ్రాయెల్‌ ట్యాంకుల దాడిలో చిక్కుకుపోయింది. ఈ ఘటనలో వాహనంలో ఉన్నవారంతా మృతి చెందగా, పాప మాత్రమే ప్రాణాలతో మిగిలి ఉంది. కారులోని ఓ వ్యక్తికి రెడ్‌ క్రెసెంట్‌ అధికారులు ఫోన్‌ చేయగా ఆమె ఎత్తింది. భయమేస్తోందని, తనను కాపాడాలని దీనంగా వేడుకుంది. అయితే, యుద్ధ పరిస్థితుల కారణంగా చిన్నారిని చేరుకోవడం ఆలస్యమైంది. దాదాపు రెండు వారాల తర్వాత ఆమె మృతదేహాన్ని శనివారం గుర్తించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)