రోహింగ్యా మహిళల అక్రమ రవాణా గుట్టురట్టు !

Telugu Lo Computer
0


అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా కేసులో మయన్మార్‌కు చెందిన ముగ్గురు వ్యక్తులపై జాతీయ దర్యాప్తు సంస్థ ఛార్జిషీట్‌ దాఖలు చేసింది. నిందితులు మయన్మార్‌లోని మౌంగ్‌డా జిల్లా నివాసితులైన రబీయుల్‌ ఇస్లాం, సోఫి అలోమ్‌, మహ్మద్‌ ఉస్మాన్‌లుగా గుర్తించింది. ఎన్‌ఐఏ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ముఠా సరైన పత్రాలు లేకుండా దేశంలోకి అక్రమంగా ప్రవేశించి, మానవ అక్రమ రవాణా చేస్తున్నారని ఎన్‌ఏఐ వెల్లడించింది. వీరు ఎక్కువగా బంగ్లాదేశ్‌ శరణార్థి శిబిరాల్లో తలదాచుకుంటున్న రోహింగ్యా(Rohingya) యువతులను, విదేశీయులను లక్ష్యంగా చేసుకుంటున్నారు. తమ జాతి పురుషులతో వివాహం జరిపిస్తామని నమ్మించి, అనంతరం ఉత్తర్‌ప్రదేశ్‌, రాజస్థాన్‌, జమ్మూకశ్మీర్‌, హరియాణా, తెలంగాణ రాష్ట్రాల్లో బలవంతపు వివాహాలకు విక్రయిస్తున్నారు. వారు వాడుతున్నవి నకిలీ ఆధార్‌ కార్డులని, వాటిని ఉపయోగించి వివిధ సిమ్ కార్డులు కొనుగోలు చేయడానికి, బ్యాంకు ఖాతాలు తెరవడానికి ఉపయోగిస్తున్నట్లు ఏఎన్‌ఐ పేర్కొంది. ఈ ఛార్జిషీట్‌తో 2023 నవంబర్ 7న కేసును విచారించడం ప్రారంభించిన ఎన్‌ఐఏ అంతర్జాతీయ మానవ అక్రమ రవాణా రాకెట్‌ను వెలికితీసేందుకు ఒక ముఖ్యమైన అడుగు వేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)