స్వల్పంగా పెరిగిన ఈపీఎఫ్‌ వడ్డీ రేటు !

Telugu Lo Computer
0


2023-24 ఆర్థిక సంవత్సరానిగాను పీఎఫ్‌పై వడ్డీ రేటు 8.15 శాతం నుంచి 8.25 శాతానికి పెంచుతూ ఎంప్లాయీస్‌ ప్రావిడెంట్‌ ఫండ్‌ ఆర్గనైజేషన్‌ కేంద్ర ట్రస్టీల బోర్డు నిర్ణయం తీసుకున్నది. గత ఆర్థిక సంవత్సరం (2022-23) ఇది 8.15 శాతంగా ఉంటే, అంతకుముందు ఆర్థిక ఏడాది (2021-22) 8.10 శాతంగా ఉన్నది. దీంతో గత మూడేండ్లలో ఇదే అత్యధిక వడ్డీ రేటుగా నిలిచింది. కాగా, స్టాక్‌ మార్కెట్లలో పెట్టుబడులను పెంచేందుకు బోర్డు నుంచి ఈపీఎఫ్‌వో అనుమతుల్ని కోరే వీలున్నది. ప్రస్తుతం 10 శాతంగా ఉన్న పెట్టుబడుల పరిమితిని 15 శాతానికి పెంచాలన్నది ఈపీఎఫ్‌వో యోచన. దీనివల్ల పీఎఫ్‌ సొమ్ముపై మరింత రాబడులు అందుకోవచ్చంటున్నది. 

Post a Comment

0Comments

Post a Comment (0)