రేపు భారత్ జోడో న్యాయ యాత్ర రద్దు !

Telugu Lo Computer
0


భారత్ జోడో న్యాయ యాత్ర బుధవారం జరగడం లేదని కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేష్ తెలిపారు. ప్రస్తుతం రాహుల్ యాత్ర ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. మంగళవారం యాత్రను ముగించుకుని ఢిల్లీకి చేరుకున్నారు. ఫిబ్రవరి 15 నుంచి యాత్ర కొనసాగుతుందని పేర్కొన్నారు. ఇదిలా ఉంటే బుధవారం సోనియాగాంధీ రాజ్యసభకు నామినేషన్ వేయనున్నట్లు తెలుస్తోంది. మంగళవారం రాత్రికి సోనియా ఎక్కడనుంచి పోటీ చేస్తారనేది క్లారిటీ రానుంది. నామినేషన్ కార్యక్రమంలో రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. హిమాచల్ ప్రదేశ్ నుంచి సోనియా పోటీ చేసే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అలాగే బుధవారం బీహార్‌లో కాంగ్రెస్ అధ్యర్యంలో మహాసభ నిర్వహిస్తు్న్నారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లిఖార్జున ఖర్గే, సోనియాగాంధీ, రాహుల్ గాంధీ పాల్గొననున్నారు. ఇదిలా ఉంటే రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ఈనెల 16న ఉత్తరప్రదేశ్‌లోని వారణాసి నుంచి ప్రారంభం కానుంది. వాస్తవానికి ఈనెల 26 వరకు అక్కడ యాత్ర కొనసాగాల్సి ఉంది. కానీ అక్కడ పబ్లిక్ ఎగ్జామ్ ఈనెల 22 నుంచి ప్రారంభంకానున్నాయి. ఈనేపథ్యంలో ఈనెల 21కే యాత్ర ముగించుకోవాలని రాహుల్ నిర్ణయం తీసుకున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)