హైదరాబాద్‌లో ఏఐ సిటీ !

Telugu Lo Computer
0


తెలంగాణలో శాసనసభ బడ్జెట్‌ సమావేశాల ప్రారంభం సందర్భంగా ఉభయసభలను ఉద్దేశించి గవర్నర్‌ తమిళిసై సౌందరరాజన్‌ ప్రసంగిస్తూ  పెద్దఎత్తున మూసీ రివర్‌ ఫ్రంట్‌ అభివృద్ధి పనులు చేపడతామని, ఆ నది మరోసారి హైదరాబాద్‌ జీవనాడిగా మారుతుందని చెప్పారు. తెలంగాణలో ప్రజల కోసం, ప్రజల చేత ఎన్నికైన ప్రభుత్వం ఉందన్నారు. రాష్ట్ర ఏర్పాటులో కలిసివచ్చిన పార్టీలు, వ్యక్తులతోపాటు అప్పటి మన్మోహన్‌ సర్కారుకు కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు చెప్పారు. ''ప్రత్యేకించి సోనియాగాంధీ షోషించిన పాత్రను ప్రభుత్వం స్మరించుకుంటోంది. ఆర్టీసీలో ఉచిత ప్రయాణం ద్వారా మహిళలు ఇప్పటివరకూ 15 కోట్ల ట్రిప్పులు ప్రయాణించారు. పాలమూరు-రంగారెడ్డి వంటి సాగునీటి ప్రాజెక్టులు పూర్తి చేస్తాం. ధరణి కమిటీ ద్వారా భూ సమస్యలు పరిష్కరిస్తాం. మా ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణ, పారదర్శకతను పాటిస్తుంది. గత ప్రభుత్వం నిర్వాకాలను శ్వేతపత్రం ద్వారా ప్రజలకు తెలియజేశాం. రాష్ట్రంలో ప్రత్యేక నైపుణ్య వర్సిటీలు ఏర్పాటు చేస్తాం. విద్యతో పాటు ఉద్యోగమూ సాధించేలా యువతలో నైపుణ్యాలు పెంపునకు కృషి చేస్తాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళ, వికలాంగ పారిశ్రామిక వేత్తలకు తోడ్పాటు అందిస్తాం. 10 నుంచి 12 ఫార్మా విలేజ్‌ క్లస్టర్ల ఏర్పాటుకు ప్రభుత్వం ప్రతిపాదిస్తోంది. సమగ్ర డిజిటల్‌ అక్షరాస్యత కార్యక్రమాన్ని ప్రభుత్వం అమలు చేస్తుంది. హైదరాబాద్‌ను దేశంలోనే కృత్రిమ మేధ (ఏఐ) ప్రధాన కేంద్రంగా అభివృద్ధి చేస్తాం. 50 నుంచి 100 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేస్తాం. రూ.2 వేల కోట్లతో ప్రభుత్వ ఐటీఐలను ఆధునిక టెక్నాలజీ సెంటర్లుగా మారుస్తాం. క్రీడారంగంలో రాష్ట్రాన్ని అగ్రగామిగా చేయడమే మా లక్ష్యం. కులగణన చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. బడ్జెట్‌ కేవలం ఆర్థిక పత్రం కాదు.. భవిష్యత్‌కు నమూనా'' అని చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)