భారత్ జోడో న్యాయ్ యాత్రలో మోడీ నినాదాలు !

Telugu Lo Computer
0


భారత్ జోడో న్యాయ్ యాత్ర ఈరోజు ఛత్తీస్‌గఢ్‌లోని కోర్బా నుంచి తిరిగి ప్రారంభమైంది. ఆయనను చూసేందుకు ప్రజలు భారీగా తరలివస్తున్నారు. రాహుల్ గాంధీకి యాత్రలో పాల్గొంటున్న వేళ కొందరు కాషాయ జెండాలు పట్టుకుని ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. మోడీ... మోడీ... అని నినదిస్తూ రాహుల్ గాంధీకి అసహనం తెప్పించే ప్రయత్నం చేశారు. అయితే, రాహుల్ గాంధీ ఏ మాత్రం అసహనానికి గురికాకుండా వెంటనే కారు ఆపి దిగి వారి వద్దకు వెళ్లి కరచాలన చేశారు. అనంతరం మళ్లీ కారు ఎక్కి, ఫ్లయింగ్ కిస్‌లు ఇచ్చుకుంటూ వెళ్లారు. రాహుల్ గాంధీ ఎక్కడికి వెళ్లినా బీజేపీ కార్యకర్తలు ఆయా ప్రాంతాల్లో మోడీ... మోడీ... నినాదాలు చేస్తున్నారు. తాను బీజేపీ సృష్టిస్తున్న విద్వేషపూరిత సమాజంలో ప్రేమను పంచుతానని రాహుల్ గాంధీ చాలా కాలంగా చెబుతున్నారు. జనవరి 14న మణిపూర్‌లోని తౌబాల్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ యాత్ర మార్చి 20న ముంబైలో ముగుస్తుంది. మొత్తం 6,700 కిలోమీటర్ల మేర యాత్ర 110 జిల్లాల మీదుగా ఉంటుంది. ఈ యాత్రను రాహుల్ గాంధీ బస్సు, కార్లలో చేస్తున్నారు. ప్రజల కష్టాలను తెలుసుకుంటూ రాహుల్ గాంధీ యాత్ర ముందుకు సాగుతోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)