భర్తకు వాత పెట్టిన భార్య !

Telugu Lo Computer
0


హైదరాబాద్ లోని బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 13 లోని అంబేద్కర్ నగర్ లో గుండప్ప, లక్ష్మీ అనే దంపతులు జీవిస్తున్నారు. వీరికి సమీపంలోనే భార్య తమ్ముళ్లు గోవింద్, బాలాజీలు జీవిస్తున్నారు. కొంత కాలంగా గుండప్ప, లక్ష్మీలు గొడవ పడుతూ ఉండేవారు. అయితే సమీపంలోని తన బామ్మర్దులు ఈ విషయాన్ని తెలుసుకొని వారించేవారు. ఇల్లు వదిలి పోవాలని గుండప్పను వేధించేవారు. ఫిబ్రవరి 7వ తేదీన సాయంత్రం 7 గంటలకు గుండప్ప, లక్ష్మీల మధ్య మరోసారి గొడవ ప్రారంభమై తీవ్ర స్థాయికి చేరకుంది. ఈ క్రమంలో అక్కడే ఉన్న బామ్మర్దులు గుండప్ప రెండు చేతులను పట్టుకున్నారు. ఆ తరువాత లక్ష్మి ఓ గరిటెను కాల్చి దానిని తీసుకొచ్చి గుండప్ప చేతిపై వాత పెట్టింది. దీంతో తీవ్రంగా ఆవేదన చెందిన గుండప్ప ఆ తరువాత తనకు జరిగిన కష్టాన్ని సమీపంలోని పోలీస్ స్టేషన్ కు వచ్చి మొర పెట్టుకున్నాడు. 


Post a Comment

0Comments

Post a Comment (0)