మాజీ ఉద్యోగులపై లాంగ్ డ్రైవ్ కార్స్ యాజమాన్యం దౌర్జన్యం !

Telugu Lo Computer
0


తెలంగాణలోని గోదావరి ఖని నుంచి వచ్చిన ఓ యువతి ఉద్యోగం కోసం కొప్పుల హరిదీప్ రెడ్డికి చెందిన లాంగ్ డ్రైవ్ కార్స్ అనే కంపెనీలో జాయిన్ అయింది. ఆ యువతి అక్కడ కొంతకాలం వర్క్ చేసిన తరువాత అగ్రిమెంట్ అడిగిన కారణంగా ఆ ఉద్యోగం మానేసి, గో కార్ట్స్ లో వర్క్ చేస్తుంది. ఈ క్రమంలో తన పాత స్నేహితులు కలవడానికి వచ్చింది . ఆ యువతి వచ్చిన మరుసటి రోజు నుంచి అక్కడే పని చేస్తున్న మరో ఆరుగురు ఉద్యోగాన్ని మానేశారు. లాంగ్ డ్రైవ్ కార్స్ యజమాని వారందరిని మంగళవారం ఆఫీసుకు పిలిపించి ఎందుకు మానేశారు అని ప్రశ్నించగా వారంతా మరో చోట ఉద్యోగంలో చేరమని చెప్పుకొచ్చారు. దీనితో ఆ యజమాని వారి అందరిని కిడ్నాప్ చేసి, వారి వద్ద నుంచి మొబైల్స్ లాక్కొని, వారి పట్ల విచక్షణ రహితంగా ప్రవర్తించాడు. ఆ కంపెనీ యజమాని , అతనితో ఉన్న బౌన్సర్లు తో సహామరికొందరు కలిసి ఇద్దరు యువతులు, ఐదుగురు యువకులను వంటిపై వాతలు తేలేలా రాత్రంతా కొట్టారు. అంతేకాకుండా వారిలో ఉన్న ఓ గిరిజన మహిళను కించపరుస్తూ దుర్భాషలాడాడు. పైగా ఈ విషయాలను ఎక్కడైనా చెప్తే.. వారిపై ఇల్లీగల్ కేసులు నమోదు చేస్తానని బెదిరించాడట!. ఆ తరువాత యువతీ యువకులను వేరువేరుగా బయటకు పంపాడు. దీనితో ఆ యువతీ యువకులు లాంగ్ డ్రైవ్ కార్స్ యజమానిపై కేసు నమోదు చేశారు. కానీ, ఇప్పటివరకు దానిపై ఎటువంటి స్పందన లేకపోవడంతో, తమకు న్యాయం చేయాలంటూ  మీడియాతో మొరపెట్టుకున్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)