స్వామినాథన్‌కు భారతరత్న ఇస్తారు కానీ, రైతుల్ని పట్టించుకోరా?

Telugu Lo Computer
0


ఢిల్లీలో నిరసన చేపడుతున్న అన్నదాతలపై టియర్ గ్యాస్ ప్రయోగించడాన్ని కాంగ్రెస్ అగ్ర నేత రాహుల్‌గాంధీ తప్పుపట్టారు. రాహుల్ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్ర ప్రస్తుతం ఛత్తీస్‌గఢ్‌లో కొనసాగుతోంది. తాజాగా ఆయన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ రైతులు చేపట్టిన చలో ఢిల్లీ కార్యక్రమంపై స్పందించారు. రైతులు కేవలం తమ డిమాండ్లు పరిష్కరించాలని మాత్రమే అడుగుతున్నారని తెలిపారు. బీజేపీ ప్రభుత్వం ఎంఎస్ స్వామినాథన్‌కు భారతరత్న ప్రకటించారు కానీ ఆయన చెప్పిన దానిని అమలు చేయడానికి మాత్రం సిద్ధంగా లేరని విమర్శించారు. రైతుల డిమాండ్లు న్యాయబద్ధమైనవి అని పేర్కొన్నారు. కానీ బీజేపీ ప్రభుత్వం మాత్రం దానిని అమలు చేయడానికి సిద్ధంగా లేదని చెప్పుకొచ్చారు. ఇండియా కూటమి అధికారంలోకి రాగానే రైతుల హామీలు నెరవేరుస్తామని హామీ ఇచ్చారు. అంతేకాదు స్వామినాథన్ చెప్పినట్లుగా అమలు చేస్తామని రాహుల్ భరోసా ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)