బెంగళూరులో మూడు రోజులు మద్యం షాపులు బంద్ !

Telugu Lo Computer
0


ర్ణాటకలోని బెంగళూరులో ఉపాద్యాయ ఎమ్మెల్సీ స్థానానికి ఉప ఎన్నిక జరగనుంది. ఈ క్రమంలోనే బెంగళూరు పోలీస్ కమిష్నరేట్ పరిధిలోకి వచ్చే ప్రాంతంలో ఫిబ్రవరి 14 సాయంత్రం 5 గంటల నుండి ఫిబ్రవరి 17 ఉదయం 6 గంటల వరకు మద్యం షాపులు బంద్ చేయాలని బెంగళూరు అర్బన్ డిప్యూటీ కమిషనర్ కెఎ దయానంద ఆదేశాల జారీ చేశారు. నగరంలోని కొన్ని ప్రాంతాల్లో మద్యం అమ్మకాలు నిషేధించబడతాయని తెలిపారు. బెంగళూరు ఉపాధ్యాయ శాసనమండలి ఉప ఎన్నిక ఫిబ్రవరి 16న జరగనుందని అందుకే ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. 1951లోని సెక్షన్ 135(సి) ప్రకారం, రూల్ 10(బి)ని పరిగణనలోకి తీసుకుని ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)