కట్టిపడేస్తున్న కశ్మీర్ సోయగాలు !

Telugu Lo Computer
0


డాదిలో ఎక్కువ రోజులు మంచుతో కప్పి ఉండే కశ్మీర్ అందాలకు సంబంధించిన ఓ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సదరు వీడియోను కేంద్ర రైల్వే శాఖ మంత్రి అశ్వినీ వైష్ణవ్ ఎక్స్‌లో(X) షేర్ చేశారు. ఇందులో దట్టంగా పరుచుకున్న మంచులోంచి ఓ రైలు వెళ్తూ ఉంటుంది. దీనిని ఓ నెటిజన్ వీడియో తీయగా.. వైష్ణవ్ పోస్ట్ చేశారు. బారాముల్లా - బనిహాల్ మధ్య ఈ రైలు నడుస్తోందని.. మంత్రి రాసుకొచ్చారు. వీడియోను ఇప్పటి వరకు 3 లక్షలకు పైగా నెటిజన్లు వీక్షించి.. వేల సంఖ్యలో షేర్ చేశారు. వారంతా కశ్మీర్ అందాలను చూసి మంత్రముగ్ధులవుతున్నారు. ఒక యూజర్ "మెస్మరైజింగ్ బ్యూటీ" అని కామెంట్ చేయగా, మరొకరు.. స్విట్జర్లాండ్‌లా ఉందంటూ.. ఇంకొకరు "వావ్ ! వీడియో చూస్తుంటే స్విట్జర్లాండ్‌లో ఉన్నట్లు అనిపిస్తుంది!" అని.. ఇలా తమకు నచ్చిన తీరులో కామెంట్ చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)