ఛత్తీస్‌గఢ్‌లో ఎన్‌కౌంటర్ లో నక్సలైట్ మృతి

Telugu Lo Computer
0


త్తీస్‌గఢ్ సుక్మా జిల్లాలో ఆదివారం భద్రతా దళాలకు, నక్సల్స్‌కు మధ్య జరిగిన ఎదురెదురు కాల్పుల్లో నక్సల్ ఒకరు మృతి చెందాడు. భేజి పోలీస్ స్టేషన్ పరిధిలో నగరం, పంటభేజి గ్రామాల మధ్యనున్న అడవుల్లో ఈ కాల్పులు జరిగాయి. కొంటా ఏరియా మావోయిస్ట్ కమిటీ సభ్యుడు సోధి గజేంద్ర , మరికొందరు అక్కడి అడవుల్లో ఉన్నారన్న సమాచారంపై భద్రతా సిబ్బంది నక్సల్ గాలింపు చర్యలు చేపట్టిందని పోలీస్ అధికారులు తెలిపారు. ఎన్‌కౌంటర్ ముగిశాక నక్సల్ మృతదేహాన్ని, 12 బోర్ రైఫిల్‌ను, పిస్తోలు, మావోయిస్టు సంబంధ సాహిత్యం, ఇతర వస్తువులు సంఘటన ప్రదేశం నుంచి పోలీస్‌లు స్వాధీనం చేసుకున్నారు. మృతి చెందిన నక్సలైట్‌ను ఇంకా గుర్తించ వలసి ఉందని పోలీస్‌లు చెప్పారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)