ఆంధ్రప్రదేశ్ లో వార్డు, గ్రామ సచివాలయ సిబ్బంది బదిలీలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో మరో 15 రోజుల్లో ఎన్నికల షెడ్యూల్ విడుదలయ్యే అవకాశం ఉంది. ఈ సమయంలో సచివాలయ ఉద్యోగుల సర్దుబాటు పైన ప్రభుత్వం తాజాగా మార్గదర్శకాలు జారీ చేసింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ, వార్డు సచివాలయాల్లో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు రేషనలైజేషన కు వీలుగా చర్యలు ప్రారంభించింది. ఈ మేరకు జిఓ ఎంఎస్‌ నెంబరు 1001ని శుక్రవారం విడుదల చేసింది. రాష్ట్రంలో మొత్తం 15,004 గ్రామ, వార్డు సచివాలయాల్లో దాదాపు 1.34 లక్షల మంది ఉద్యోగలున్నారు. ప్రస్తుతం 7900 సచివాలయాల్లో 8 మంది కంటే ఎక్కువగానే ఉద్యోగులు కొనసాగుతున్నారు. సుమారు 3,300 సచివాలయాల్లో 8 మంది కంటే తక్కువ సంఖ్యలో ఉన్నట్లు గుర్తించారు. దీంతో, ప్రతీ సచివాలయంలో కనీసం 8 మంది ఉండేలా ప్రభుత్వం తాజా మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ మేరకు జిఓ ఎంఎస్‌ నెంబరు 1001ని విడుదల చేసింది. 8 మంది పని చేస్తున్న చోట ఎవరికీ బదిలీలు ఉండవని అధికారులు స్పష్టం చేసారు. ప్రభుత్వ తాజా నిర్ణయం ద్వారా దాదాపుగా 5 వేల మందికి స్థాన చలనం ఉండే అవకాశం కనిపిస్తోంది. పాత జిల్లాల యూనిట్‌ ప్రకారమే రేషనలైజేషన్‌ ప్రకియ ఉంటుందని అందులో స్పష్టం చేసింది. స్పౌస్‌ కేటగిరిలో భార్య, భర్తలకు జిల్లా/అంతర్‌ జిల్లాల బదిలీలు చేయొచ్చని కూడా జిఓలో పేర్కొంది. జిల్లాల్లో అవసరమైన పోస్టులకు బదిలీల కౌన్సెలింగ్‌ నిర్వహించాలని తెలిపింది. ఎనిమిది మంది కంటే ఎక్కువ సచివాలయ ఉద్యోగులు ఉన్న గ్రామ, వార్డు సచివాలయాల నుంచి ఎనిమిది మంది కంటే తక్కువ ఉన్న సచివాలయాలకు సిబ్బందిని బదిలీలు చేయనున్నారు. బదిలీల ప్రక్రియలో హోదాల ప్రాధాన్యతా క్రమంలో నాలుగు అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని ప్రభుత్వం పేర్కొంది. ఉద్యోగులతో నేరుగా కౌన్సిల్గ్ ద్వారా ఈ సర్దుబాటు ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం స్పష్టం చేసింది. గ్రామీణ ప్రాంతాల్లోనైతే మొదటి ప్రాధాన్యతగా సంక్షేమం, విద్య అసిస్టెంట్‌/వార్డు సంక్షేమం అభివృద్ధి కార్యదర్శి (డబ్ల్యుడబ్ల్యుడబ్ల్యు డిఎస్‌), రెండో ప్రాధాన్యతగా గ్రామ మహిళా సంరక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌ (జిఎంఎస్‌కె)), మూడో ప్రాధాన్యతగా డిజిటల్‌ అసిస్టెంట్లు, నాలుగో ప్రాధాన్యతగా పంచాయతీ కార్యదర్శి గ్రేడ్‌, పట్టణాల్లో ప్రాధాన్యత వార్డు సంక్షేమం, అభివృద్ధి కార్యదర్శి, రెండో ప్రాధాన్యతగా వార్డు మహిళలు, బలహీనుల విభాగం రక్షణ కార్యదర్శి (మహిళా పోలీస్‌), మూడో ప్రాధాన్యతగా వార్డు విద్య, డేటా ప్రాసెసింగ్‌ కార్యదర్శులుగా ప్రాధాన్యతల వారీ బదిలీల ప్రక్రియ చేపట్టాలని ప్రభుత్వం తాజా ఆదేశాల్లో మార్గనిర్దేశం చేసింది.

Post a Comment

0Comments

Post a Comment (0)