సెలెక్ట్ అయిన టీచర్లకు రెండేళ్ల అప్రెంటిస్ షిప్ లో గౌరవ వేతనం

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో త్వరలో 6100 ఉపాధ్యాయ ఖాళీల భర్తీ కోసం డీఎస్సీ పరీక్ష నిర్వహణకు ప్రభుత్వం సిద్ధమవుతోంది. వివిధ కేటగిరీల్లో నిర్వహించే ఈ పరీక్షల్లో ఖాళీలను నోటిఫై చేస్తూ 12న నోటిఫికేషన్ కూడా విడుదల చేయబోతోంది. డీఎస్సీ కంటే ముందే దీనికి అర్హత పరీక్ష అయిన టెట్ ను కూడా నిర్వహించనుంది. ఇందులో క్వాలిఫై అయిన వారికి డీఎస్సీ పరీక్ష రాసే అవకాశం కల్పిస్తారు. అయితే డీఎస్సీ పరీక్షలో ఉత్తీర్ణులై ఉపాధ్యాయ ఉద్యోగాలకు ఎంపికైన వారు రెండేళ్ల పాటు అప్రెంటిస్ షిప్ కాలంలో పనిచేయాల్సి వస్తుంది. డీఎస్సీకి ఎంపికైన వివిధ కేటగిరీల టీచర్లకు రెండేళ్ల అప్రెంటిస్ షిప్ కాలంలో కేవలం గౌరవ వేతనం మాత్రమే చెల్లిస్తారు. ఈ మొత్తం ఎంత ఉంటుందనే దానిపై ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. దీని ప్రకారం డీఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులకు తొలి ఏడాది వారి బేసిక్ పేలో 50 శాతం గౌరవ వేతనంగా చెల్లిస్తారు. అలాగే రెండో ఏడాది బేసిక్ లో 60 శాతాన్ని గౌరవ వేతనంగా చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ లెక్కన చూస్తే ప్రస్తుతం ఎస్జీటీ (సెకండరీ గ్రేడ్ టీచర్) కి బేసిక్ గా ఉన్న రూ.32670లో 50 శాతం అంటే రూ.16335ని ఇప్పుడు డీఎస్సీలో ఎంపికైన అభ్యర్ధులకు తొలి ఏడాది అప్రెంటీస్ కాలంలో చెల్లిస్తారు. అలాగే రెండో ఏడాది ఈ మొత్తం రూ.19602కు చేరనుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్లు, టీజీజీలకు తొలి ఏడాది రూ.22285 చొప్పున గౌరవ వేతనంగా చెల్లిస్తారు. అలాగే రెండో ఏడాది రూ.26742 చొప్పున చెల్లిస్తారు. అదే పీజీటీ అయితే అప్రెంటిస్ షిప్ తొలి ఏడాదిలో రూ.24220ని గౌరవ వేతనంగా చెల్లిస్తారు. రెండో ఏడాది రూ.29064ని గౌరవ వేతనంగా చెల్లించాలని నిర్ణయించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)