ఏడాది పొడవునా బట్టలు ధరించని గ్రామం !

Telugu Lo Computer
0


డాది పొడవునా బట్టలు అస్సలు ధరించని గ్రామం బ్రిటన్ లోని హెర్ట్‌ఫోర్డ్‌షైర్‌ కౌంటీలో స్పీల్‌ప్లాట్జ్. ఈ గ్రామంలోని ప్రజలు బట్టలు ధరించరు. ఈ గ్రామంలో డబ్బున్నోళ్లు, లేనోళ్లు అని తేడా లేకుండా ప్రతి ఒక్కరు స్త్రీలు, పురుషులు, పిల్లలు కూడా బట్టలు లేకుండా ఇక్కడ నివసిస్తున్నారు. ఈ గ్రామంలో 90 ఏళ్లుగా ఈ సంప్రదాయం కొనసాగుతోంది. ఇక్కడ నివసించే ప్రజలు పూర్తి విద్యావంతులు, ధనవంతులు కూడా. సాధారణ ప్రజలలాగే ఈ గ్రామ ప్రజలు కూడా క్లబ్బులు, పబ్బులు, స్విమ్మింగ్ పూల్స్ వంటి వాటిని ఇష్టపడతారు. అయినప్పటికీ, ఈ వ్యక్తులు బట్టలు కొనరు లేదా ధరించరు. అయితే గ్రామం నుండి నగరానికి వెళ్ళేటప్పుడు ప్రజలు బట్టలు ధరిస్తారు, కాని వారు తిరిగి వచ్చిన వెంటనే మళ్ళీ బట్టలు లేకుండా జీవించడం ప్రారంభిస్తారు. ప్రజలు స్వేచ్ఛగా ఉండేందుకు ఇలా చేస్తారు. ఇక్కడి ప్రజలు ఒకరితో ఒకరు కలగలిసి ఉంటారు. ఇంతకుముందు కొన్ని సామాజిక సంస్థలు ఈ గ్రామస్థుల సంప్రదాయాన్ని వ్యతిరేకించేవి, కానీ ఇప్పుడు ఎవరూ ఏమీ అనరు. అయితే ఈ గ్రామ ప్రజలు కావాలనుకుంటే శీతాకాలంలో బట్టలు ధరించవచ్చు. బట్టలు ధరించకుండా వారిని ఎవరూ ఆపరు. ఇక్కడ మరో ముఖ్య విషయం ఏంటంటే  సందర్శనార్థం ఇక్కడికి వచ్చే వారు కూడా ఇక్కడే ఉండాలంటే బట్టలు లేకుండా ఉండాల్సి వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)