అబుదాబిలో అతిపెద్ద హిందూ దేవాలయం

Telugu Lo Computer
0


యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) అబుదాబి నగరంలో నిర్మితమవుతున్న ఈ ఆలయం ఫిబ్రవరి 14, 2024న ప్రధాని నరేంద్రమోడీ చేతుల మీదుగా ప్రారంభం కాబోతోంది. అబుదాబి ఆలయం అరబ్ దేశాల్లో అతి పెద్ద మందిరంగా, మిడిల్ ఈస్ట్‌లోనే అతిపెద్ద ఆలయంగా గుర్తింపు తెచ్చుకుంది. ఆలయ ప్రారంభానికి ఒక రోజు ముందు, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్‌లోని భారతీయులు ఉద్దేశిస్తూ ఫిబ్రవరి 13న ‘అహ్లాన్ మోడీ’ సమావేశంలో ప్రసంగిస్తారు. అబుదాబిలోని జాయెద్ స్పోర్ట్స్ సిటీ స్టేడియంలో ఈ భారీ సమావేశం జరగబోతోంది. ఇస్లామిక్ దేశంగా ఉన్న యూఏఈలో ఆ దేశ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ ఆల్ నహ్యాన్ ఆలయ నిర్మాణానికి భూమిని కేటాయించారు. 2019లో యూఏఈ టాలరెన్స్ అండ్ కో-ఎగ్జిటెన్స్ మంత్రి షేక్ నహాయన్ ముబారక్ అల్ నహ్యాన్ ఈ ఆలయానికి శంకుస్థాపన చేశారు. ఈ కార్యక్రమానికి ఆ సమయంలో మంత్రితో పాటు పలువురు అరబ్ ప్రముఖులు పాల్గొన్నారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)