ఏపీ ఇంటర్‌ పరీక్షల హాల్‌టికెట్లు విడుదల !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షలక సంబంధించిన హాల్‌టికెట్లు విడుదలయ్యాయి. ఇంటర్ బోర్డు అధికారిక వెబ్ సైట్ లో హాల్‌టికెట్లను అందుబాటులో ఉంచారు. విద్యార్థులు తమ రూల్ నంబర్/ ఎస్ఎస్సీ హాల్టికెట్ నంబర్తో హాల్‌టికెట్లు డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మార్చి 1 నుంచి 20 వరకు ఇంటర్ పరీక్షలు నిర్వహించనున్నారు. ఇంటర్మీడియట్ వార్షిక పరీక్షల నిర్వహణకు ఏపీ ఇంటర్ బోర్డు అన్ని ఏర్పాట్లు పూర్తిచేసింది. రాష్ట్రవ్యాప్తంగా 1,559 కేంద్రాలు ఏర్పాటుచేశారు. ఈ ఏడాది ఇంటర్ పరీక్షలకు 10 లక్షలకుపైగా అభ్యర్థులు హాజరుకానున్నారు. ఇందులో ఇంటర్ మొదటి సంవత్సరం 4.73 లక్షల మంది, ఇంటర్ రెండో సంవత్సరం 5.29 లక్షల మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. ఇప్పటికే ఫిబ్రవరి 5న ప్రారంభమైన ప్రాక్టికల్స్ పరీక్షలు ఫిబ్రవరి 20తో ముగియడంతో తాజాగా ఇంటర్ వార్షిక పరీక్షల హాల్‌టికెట్లను ఇంటర్ బోర్డు విడుదల చేసింది.ఇంటర్ పరీక్షల నిర్వహణకు పకడ్భందీ ఏర్పాట్లు చేసింది. ఇప్పటికే ఆయా పరీక్ష కేంద్రాల్లో అన్ని గదుల్లో అధికారులు సీసీ కెమెరాలు అమర్చారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్ధుల హాజరును ఆన్లైన్ ద్వారా తీసుకోనున్నారు. అలాగే పరీక్ష పేపర్లకు క్యూఆర్ కోడ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు. పేపర్ను ఎక్కడ ఫొటో తీసినా, స్కాన్ చేసినా వెంటనే వివరాలు తెలిసిపోయేలా చర్యలు తీసుకున్నారు.పరీక్ష కేంద్రాల్లోకి ఫోన్లకు అనుమతి లేదని బోర్డు స్పష్టం చేసింది. పేపర్లను భద్రపరిచే పోలీస్ స్టేషన్లలో కూడా ఈసారి ఇంటర్ బోర్డు ప్రత్యేక ఏర్పాటు చేస్తోంది. అక్కడ ప్రత్యేకమైన బేసిక్ ఫోన్ను మాత్రమే వినియోగించేలా చర్యలు తీసుకుంటోంది. ఈ ఫోన్లు కేవలం బోర్డు నుంచి పరీక్షల విభాగం అధికారులు ఇచ్చే మెసేజ్లను చూసేందుకే మాత్రమే ఉపయోగపడుతుంది. తిరిగి మెసేజ్ ఇచ్చేందుకు, ఫోన్ చేసేందుకు ఈ ఫోన్లలో సదుపాయం ఉండదు. అంతేకాకుండా ఈ ఫోన్ పరీక్ష రోజు ఉదయం 15 నిమిషాలు మాత్రమే పనిచేస్తుంది. ఇంటర్ పరీక్షల్లో ఎలాంటి అవాంచిత చర్యలకు పాల్పడకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)