'మహా స్వాప్నికుడు' చంద్రబాబు పుస్తకావిష్కరణ !

Telugu Lo Computer
0


తెదేపా అధినేత చంద్రబాబుపై సీనియర్‌ పాత్రికేయుడు పూల విక్రమ్‌ రచించిన 'మహా స్వాప్నికుడు' పుస్తకాన్ని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్‌ గోపాలగౌడ ఆవిష్కరించారు. కువైట్‌లో స్థిరపడిన ప్రవాసాంధ్రుడు వెంకట్‌ కోడూరి ఈ పుస్తకాన్ని ప్రచురించారు. ఒక సామాన్య రైతు కుటుంబంలో పుట్టి... కృషి, పట్టుదల, నిరంతర శ్రమే ఆయుధాలుగా అంచెలంచెలుగా ఎదిగి, తన దార్శనికతతో రాష్ట్రానికి దశ, దిశ నిర్దేశించిన చంద్రబాబు గురించి పుస్తకంలో వివరించారు. చంద్రబాబు బాల్యం, విద్యాభ్యాసంతో ప్రారంభించి... ఇటీవల చోటుచేసుకున్న పరిణామాలు, జగన్‌ ప్రభుత్వం కక్షసాధింపుతో పెట్టిన తప్పుడు కేసుల్ని దీటుగా ఎదుర్కోవడం, 53 రోజులపాటు అక్రమంగా జైల్లో పెట్టినా మొక్కవోని దీక్షతో ఆయన సాగిస్తున్న అలుపెరగని పోరాటం వరకు... అన్ని అంశాల్నీ పుస్తకంలో పొందుపరిచారు. చంద్రబాబును రాజకీయంగా ఎదుర్కోలేక, ఆయన వ్యక్తిత్వాన్ని దెబ్బతీసేందుకు రాజకీయ ప్రత్యర్థులు చేసిన దుష్ప్రచారాలు-వాస్తవాలపై ఒక అధ్యాయమే ఉంది. ఆయన కుటుంబానికి రెండు ఎకరాల ఆస్తి మాత్రమే ఉండేదని, అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఆయన ఆస్తులు సంపాదించారన్నది ఎలా దుష్ప్రచారమో వివరించారు. విజయవాడలో జరిగిన ఈ కార్యక్రమంలో తెదేపా నేతలు టీడీ జనార్దన్‌, నెట్టెం రఘురామ్‌, నన్నపనేని రాజకుమారి తదితరులు పాల్గొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)