పెళ్లి విందులో మహిళలకు మద్యం సరఫరా వీడియో మీడియాలో వైరల్ !

Telugu Lo Computer
0


పెళ్లికి వచ్చిన అతిథులు కుర్చీలపై కూర్చొని భోజనం చేస్తుండగా ఆల్కహాల్‌ అందిస్తున్న వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరో విశేషం ఏంటంటే మగవారికి ఏ మాత్రం తీసిపోకుండా పెద్ద సంఖ్యలో మహిళలు కూర్చుని ఉన్న బంతిలో వారికి గ్లాసుల్లో మద్యం ఇస్తున్నారు. కొంతమంది మహిళలు పెళ్లికి వచ్చిన అతిథులకు ఆహారంతో పాటు మద్యం కూడా అందిస్తున్నారు. ఇంటర్‌నెట్‌లో విపరీతంగా వైరల్‌ అవుతున్న వీడియోపై ప్రజలు కూడా పెద్ద సంఖ్యలో స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఈ వీడియో ఏదో ఫంక్షన్‌కి సంబంధించినదిగా అర్థం అవుతోంది. వీడియోలో చాలా మంది మహిళలు క్యూలో కూర్చుని భోజనం చేస్తున్నారు. మరోవైపు భోజనం తింటున్న మహిళలకు ముగ్గురు నలుగురు మహిళలు వంతులవారీగా గ్లాసుల్లో మద్యం అందిస్తున్నారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే ఈ వీడియోలో కనిపిస్తున్న వారిలో ఎక్కువ మంది మహిళలే ఉన్నారు. అయితే, ఇక్కడ కొందరు మహిళలు మద్యం తీసుకోవడానికి నిరాకరించారు. కానీ, కొందరు మహిళలు ఇక్కడ పెట్టు అంటూ గట్టిగానే అడిగేస్తున్నారు. మద్యం తాగుతున్న మహిళల ఫోటోలు తీస్తున్న కెమెరా మ్యాన్ కూడా వీడియోలో కనిపిస్తాడు.@HasnaZaruriHai అనే వినియోగదారు ఈ వీడియోని సోషల్ మీడియా Xలో షేర్ చేశారు. సోషల్ మీడియాలో ఈ వీడియోపై యూజర్లు విపరీతంగా కామెంట్లు చేస్తున్నారు. వామ్మో.. ఇక్కడ మహిళలకు అందిస్తున్నట్లుగా వారి స్థానంలో మగవారికి మద్యం ఎక్కడ అందించరు.. అదేంటో మరీ అంటూ ఒక వినియోగదారు అసహనం వ్యక్తం చేశారు. ఇకపోతే, ఇక్కడ మహిళలు బాగా ఎంజాయ్‌ చేస్తున్నారంటూ మరో వినియోగదారుడు స్పందించారు. అయితే, ఈ వీడియో ఎక్కడిది? వీడియోలో ఉన్న మహిళలు ఎవరు అనే సమాచారం మాత్రం వెల్లడి కాలేదు. 

Post a Comment

0Comments

Post a Comment (0)