నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం ముదాహం !

Telugu Lo Computer
0


తెలంగాణ ప్రభుత్వం పద్మ అవార్డ్స్ కు ఎంపికైన వారిని సత్కరించింది. ఈ కార్యక్రమంలో చిరంజీవి మాట్లాడుతూ రాజకీయాల్లో దిగజారి మాట్లాడటం సరికాదని, వ్యక్తిగత దూషణలు చేసే వారిని ప్రజలే తిరస్కరించాలని సూచించారు. నంది అవార్డులకు గద్దర్ పేరు పెట్టడం సంతోషానిచ్చిందని అన్నారు. తమకు పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించిన వెంటనే ముందుకు వచ్చి సన్మానిస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే మొదట పద్మ భూషణ్ వచ్చినపుడు చాలా ఆనందం అనిపించింది. పద్మవిభూషణ్ ఇప్పుడు ప్రకటించినపుడు అందరూ అభినదిస్తుంటే అంతకన్నా ఆనందం అనిపిస్తుంది అన్నారు. అవార్డు లు ప్రకటించిన వెంటనే రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి సత్కరించటం అనేది నిజంగా ఆనందం. ఇప్పటివరకు నంది అవార్డులు నామమాత్రంగా నిర్వహిస్తూ వచ్చారు. ఇప్పుడు దాన్ని ప్రతి సంవత్సరం నిర్వహించాలని నిర్ణయించి నంది అవార్డు పేరుకు గద్దర్ పేరు పెట్టడం అనేది నిజంగా ఆనందం. మా చిన్నప్పుడు వెంకయ్య నాయుడు స్టూడెంట్ లీడర్ గా ఉద్యమం చేస్తే వైజాగ్ స్టీల్ ప్లాంట్ కోసం మేమందరం కలిసి వెళ్ళాము. రాజకీయాలను ఎంతో హుందాగా నిర్వహించిన వ్యక్తి వెంకయ్య నాయుడు. ఉప రాష్ట్రపతి స్థాయికి ఎదిగిన మన తెలుగు వారు వెంకయ్య నాయుడు నిజంగా గర్వకారణం. అలా హుందా రాజకీయాలు చేయాలనే రాజకీయాల్లోకి ప్రవేశించాను. రాజకీయాల్లో దిగజారి మాట్లాడటం, వ్యక్తిగత దూషణలు చేసే రాజకీయాలకు స్వస్తి పలకాలంటే ప్రజల ఓటు హక్కే ఆయుధం. రాజకీయ విజ్ఞత కలిగిన నరేంద్ర మోడీ మీద నాకు మరింత గౌరవం పెరిగింది. బ్లడ్ బ్యాంక్, ఐ బ్యాంకు,కరోనా టైం లో ఆక్సిజన్ బ్యాంకు లాంటిది సేవా కార్యక్రమంలు చేయడానికి ఫాన్స్ చాలా సహకరించారని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)