డెయిరీ మిల్క్​ చాక్లెట్​లో పురుగులు ?

Telugu Lo Computer
0


హైదరాబాద్ లో రాబిన్​ ​ అనే ప్రయాణికుడు అమీర్​పేట్​ మెట్రో ఇంటర్​ చేంజ్​లో ఉన్న రత్నదీప్​ స్టోర్​ నుంచి ఒక డెయిరీ మిల్స్​ చాక్లెట్​ కొనుగోలు చేశాడు. దానికి సంబంధించిన బిల్లు కూడా అతను తీసుకున్నాడు. తీరా దాన్ని ఓపెన్​ చేస్తే పురుగులు కనిపించాయి. దీంతో అతను దాన్ని వీడియో, ఫొటోలు తీసి ట్విట్టర్​లో షేర్​ చేశాడు. అంతేకాకుండా ఈ విషయాన్ని జీహెచ్​ఎంసీ అధికారుల దృష్టికి తీసుకెళ్లాడు. ట్విట్టర్​లో తన ఎక్స్​పీరియన్స్​ని షేర్​ చేశాడు. ఇప్పుడిది పెద్ద ఎత్తున వైరల్​ అవుతోంది. గడువు ముగిసే ఉత్పత్తులకు నాణ్యత తనిఖీ ఉందా? ప్రజారోగ్య ప్రమాదాలకు ఎవరు బాధ్యత వహిస్తారు? అని రాబిన్​ ట్విట్టర్​లో ప్రశ్నించాడు. హైదరాబాద్‌లోని మెట్రో ఇంటర్‌చేంజ్ స్టేషన్ అమీర్​పేట్​లోని రత్నదీప్ స్టోర్ నుండి కొనుగోలు చేసిన డెయిరీ మిల్క్​ బిల్లు ఫొటోను కూడా షేర్ చేశాడు. దీనిపై రిప్లయ్​ కోసం జీహెచ్​ఎంసీని ట్యాగ్ చేశాడు. అతని ఫిర్యాదుతో జీహెచ్​ఎంసీ తక్షణమే గుర్తించి, సమస్యను త్వరగా పరిష్కరించాలని సంబంధిత ఆహార భద్రతా బృందాన్ని ఆదేశించింది. ఈ వీడియో, ఫొటోలను చూసిన చాలామంది ట్విట్టర్​ (ఎక్స్​) నెటిజన్లు సీరియస్​గా స్పందిస్తున్నారు. మెట్రో స్టేషన్స్​, మాల్స్​, ఎయిర్​పోర్ట్​ మాల్స్​లోనూ తమకు ఎదురైన అనుభవాలను షేర్​ చేసుకుంటున్నారు. ఇలాంటి నిర్లక్ష్యంపై సీరియస్​ యాక్షన్​ తీసుకోవాలని అధికారులను డిమాండ్​ చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)