ఈ దేశానికి త్రీ ఇడియట్స్‌ 'మాధవన్‌'లు వద్దు !

Telugu Lo Computer
0


ఢిల్లీలో జరుగుతున్న గ్లోబల్ బిజినెస్‌ సమ్మిట్‌ 2024లో కేంద్రమంత్రి పీయూశ్‌ గోయల్‌ మాట్లాడుతూ 'మేం యువత ప్రతిభను గుర్తిస్తున్నాం. మోడీ నేతృత్వంలోని ప్రభుత్వం నైపుణ్యాభివృద్ధిపై దృష్టి సారించి, కొత్త శాఖను ప్రారంభించింది. మన పిల్లల్లో మాధవన్లు ఉండాలని కోరుకోవడం లేదు. ఇక్కడున్నవారు త్రీ ఇడియట్స్‌ సినిమా చూసే ఉంటారు. అందులో మాధవన్ పాత్రధారి ఒక అద్భుతమైన ఫొటోగ్రాఫర్. తల్లిదండ్రుల కోరిక మేరకు ఇంజినీరింగ్ చదువుతాడు. ఈ దేశానికి అలాంటి వారు వద్దు. మనం యువతలోని నైపుణ్యాలను గుర్తించి, అవకాశాలను కల్పించాల్సిన సమయం ఇది. ఆ దిశగా ఇండియా ప్రయాణం ప్రారంభించింది' అని అన్నారు. యువత తమ ఇష్టాలకు అనుగుణంగా ముందుకు సాగాలని పీయూశ్‌ గోయల్‌  ప్రోత్సహించారు. నరేంద్ర మోడీ పాలనలో సామాన్య ప్రజలు సాధికారత పొందారని వెల్లడించారు. తమ ప్రభుత్వం ప్రతి భారతీయుడి ప్రాథమిక అవసరాలపై ప్రధానంగా దృష్టి సారించిందన్నారు. గతంలో ఈ కనీస అవసరాలు కూడా ఒక కలలా అనిపించేవని కాంగ్రెస్ నేత్వత్వంలోని యూపీఏ పాలనను ఉద్దేశించి విమర్శలు చేశారు.

Post a Comment

0Comments

Post a Comment (0)