ఆంధ్రప్రదేశ్ లో పాత బ్రాండ్ ల మద్యం అమ్మకం ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లో అమ్ముతున్న మద్యం బ్రాండ్ ల గురించి గత నాలుగేళ్లుగా సోషల్ మీడియాలో సెటైర్లు,  పొలిటికల్ గా విమర్శలు మనకు తెలిసిందే. కొత్త పేర్లతో జరిగిన అమ్మకాల పైన మందుబాబుల్లో ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ మద్యం ధరలు భారీగా ఉండి, టేస్ట్ వరస్ట్ గా ఉంటుందంటూ సోషల్ మీడియాలో ఆ బ్రాండ్లపై జోకులు కూడా పెద్ద ఎత్తునే ఉన్నాయి. ఈ బ్రాండ్లు ఆరోగ్యం పైనా ప్రభావం చూపుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. అయితే ఇన్నాళ్లు కోరుకున్న మద్యం దొరకట్లేదని దిగులుపడుతున్న మందుబాబులకు గతంలో ఉండే పాత బ్రాండ్ల మద్యం మళ్లీ అందుబాటులోకి వచ్చింది. మరికొద్ది రోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న ఈ సమయంలో అనూహ్యంగా పలు ప్రాంతాల్లో బార్లు, ప్రభుత్వ మద్యం షాపులకు అన్ని బ్రాండ్ల మద్యాన్ని సరఫరా చేస్తున్నారు. పాత బ్రాండ్లు మళ్లీ రావడంతో మద్యం వ్యాపారం ఊపందుకుంటోంది. ప్రస్తుతం బార్లు, మద్యం దుకాణాల్లో పాత బ్రాండ్ల అమ్మకాలు మొదలయ్యాయి. పాత బ్రాండ్లు తేవడంతో ఎన్నికల సమయంలో మంచి వ్యాపారం జరుగుతుందని బార్ల యాజమాన్యాలు అంచనా వేస్తున్నాయి. ఇప్పటికే బార్లకు కావాల్సిన విధంగా బ్రాండ్లు సరఫరా చేస్తున్నారు. షాపులకు కూడా అన్ని బ్రాండ్ల మద్యం ఇస్తున్నా అన్ని షాపులకు ఇంకా పూర్తిస్థాయిలో చేరలేదు. కాగా, పాపులర్‌ బ్రాండ్ల కంపెనీలతో తాజాగా చేసుకున్న ఒప్పందం ప్రకారం తిరిగి పాత బ్రాండ్ల మద్యం అందుబాటులోకి తెచ్చినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)