ఎస్బీఐలో కోటిన్నర విలువైన బంగారం చోరీ ?

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని కాకినాడ జిల్లా ప్రత్తిపాడు మండలం ఉత్తరకంచి ఎస్బీఐ బ్యాంకులో భారీ చోరీ జరిగింది. సుమారు రూ. 30లక్షల నగదు, రూ.కోటిన్నర విలువ చేసే బంగారం గత రాత్రి అపహరణకు గురైంది. బ్యాంక్ వెనుక భాగంలో కిటికీ డ్రిల్స్ ను గ్యాస్ కట్టర్ తో తొలగించి దుండగులు బ్యాంకులోకి చొరబడినట్లు గుర్తించారు. ఉదయాన్నే బ్యాంక్ సిబ్బంది దొంగతనాన్ని గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు.. దీంతో విషయం తెలుసుకున్న ఎస్పీ సతీష్ కుమార్ సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు.

Post a Comment

0Comments

Post a Comment (0)