శ్రీలంకకు భారత జలాంతర్గామి !

Telugu Lo Computer
0


భారత్ మాల్దీవుల మధ్య కొనసాగుతున్న దౌత్య పరమైన వివాదాలు, ఉద్రిక్తతలను నేపథ్యంలో శ్రీలంక నుండి మాల్దీవులకు హిందూ మహాసముద్రం గుండా చైనా గూడచారి నౌక షియాన్‌ యాంగ్‌ హాంగ్‌-3 ప్రయాణం సాగిస్తున్న క్రమంలో భారత్ మరో సంచలన నిర్ణయం తీసుకుంది. భారత్ ఐఎన్ఎస్ కరంజ్ అనే జలాంతర్గామిని శ్రీలంకలోని ప్రధాన నౌకాశ్రయాలలో ఒకదానికి పంపింది. దీని ద్వారా చైనా మరియు మాల్దీవులకు ఒక స్పష్టమైన సంకేతాన్ని ఇండియా పంపింది. భారత నౌకాదళానికి చెందిన డీజిల్ ఎలక్ట్రికల్ జలాంతర్గామి ఐఎన్ఎస్ కరంజ్ ఇప్పటికే కొలంబో పోర్టుకు చేరుకోగా, శ్రీలంక దానికి లాంఛన ప్రాయంగా స్వాగతం పలికింది. కొలంబోలోని న్యూఢిల్లీ రాయబారి సంతోష్ ఝా జలాంతర్గామిని సందర్శించి కమాండింగ్ ఆఫీసర్ తో, సిబ్బందితో సంభాషించారు. శ్రీలంక నావికా దళానికి చెందిన వంద మంది సిబ్బందికి సబ్ మెరైన్ ఆన్ బోర్డు గురించి వివరించారు. ఇక జలాంతర్గామి నేడు కొలంబో నుండి బయలుదేరుతుందని భారత హై కమిషన్ పేర్కొంది. శ్రీలంక స్వాతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని భారత నౌకాదళం జలాంతర్గామిని కొలంబోకు పంపింది. ఈ జలాంతర్గామిని పంపటం ద్వారా హిందూ మహాసముద్ర భద్రతా ప్రదాతగా భారతదేశం పాత్రను హైలైట్ చేయడంతో పాటు బీజింగ్ కు, మాల్దీవులకు తద్వారా ఒక స్పష్టమైన సంకేతాన్ని పంపింది.

Post a Comment

0Comments

Post a Comment (0)