కాంగ్రెస్‌ పార్టీలోకి పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ !

Telugu Lo Computer
0


పెద్దపెల్లి సిట్టింగ్ ఎంపీ వెంకటేష్ నేత అనుహ్యంగా బీఆర్ఎస్‌కు రాజీనామా చేసిన ఆయన కాంగ్రెస్ గూటికీ చేరారు. ఢిల్లీలో ఉన్న తెలంగాణ సీఎం రేవంత్ ఆధ్వర్వంలో ఇవాళ వెంకటేష్ నేత కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ మేరకు సీఎం రేవంత్ రెడ్డితో కలిసి ఆయన ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ ఇంటికి వెళ్లారు. కేసీ వేణుగోపాల్ సమక్షంలో ఎంపీ వెంకటేష్ నేత కాంగ్రెస్ పార్టీలో చేరారు. కండువా కప్పి వెంకటేష్ నేతను కేసీ వేణుగోపాల్ పార్టీలోకి ఆహ్వానించారు. ఎంపీతో పాటు మరో బీఆర్ఎస్ నేత మన్నె జీవన్ రెడ్డి సైతం కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యారు. పెద్దపల్లి ఎంపీ టికెట్ మరోసారి ఇచ్చేందుకు గులాబీ బాస్ నిరాకరించడంతో వెంకటేష్ నేత పార్టీ వీడినట్లు తెలుస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)