రహస్య కెమెరా అమర్చిన డెంటల్ స్టూడెంట్‌ అరెస్టు !

Telugu Lo Computer
0


చెన్నైలో ఒక మహిళ తన భర్తతో కలిసి మూడేళ్లుగా ఒక అద్దె ఇంట్లో నివసిస్తున్నది. జనవరి 30న ఆమె ఇంటిని శుభ్రం చేస్తుండగా ఒక పెన్ను మాదిరి పరికరం నుంచి రెడ్‌ లైట్‌ రావడాన్ని గమనించింది. ఈ విషయాన్ని తన భర్తకు చెప్పింది. కాగా, పని తర్వాత ఇంటికి తిరిగి వచ్చిన మహిళ భర్త ఆ పెన్ను మాదిరి పరికరాన్ని పరిశీలించాడు. దానికి రహస్య కెమెరా ఉన్నట్లు గుర్తించాడు. అందులో రికార్డైన క్లిప్‌లు పరిశీలించిన ఆ దంపతులు షాక్‌ అయ్యారు. ఆ మహిళ దుస్తులు మార్చుకున్నప్పుడు ఆ రహస్య కెమెరా ద్వారా రికార్డ్‌ చేసినట్లు తెలుసుకున్నారు. ఆ దంపతులు దీని గురించి పోలీసులకు ఫిర్యాదు. మరోవైపు ఆ బిల్డింగ్‌ యజమాని కుమారుడైన ఇబ్రహీం, ఆ రహస్య కెమెరాను ఆ మహిళ ఇంట్లో ఉంచినట్లు పోలీసులు దర్యాప్తులో తెలుసుకున్నారు. డెంటల్‌ స్టూడెంట్‌ అయిన అతడ్ని అరెస్ట్‌ చేశారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)