ఎన్డీఏ అంటే ''నో డేటా అవైలబుల్''

Telugu Lo Computer
0


రాజ్యసభలో ఈ రోజు ప్రధాని నరేంద్రమోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్‌పై తీవ్ర విమర్శలు చేశారు. యూపీఏ ప్రభుత్వంలో వైఫల్యాలను పీఎం మోడీ ఎండగట్టారు. అయితే, కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే అంతే స్థాయిలో బీజేపీపై విమర్శలు చేశారు. ప్రధాని నిరుద్యోగం, ధరల పెరుగుదల, ఆర్థిక అసమానత వంటి అంశాలపై మాట్లాడలేదని, రాజ్యాంగంపై నమ్మకం లేని వారు కాంగ్రెస్‌కి దేశభక్తి గురించి బోధిస్తున్నారంటూ ఎద్దేవా చేశారు. ప్రధాని మోడీ పదేళ్ల అధికారం గురించి మాట్లాడకుండా కాంగ్రెస్ పార్టీని విర్మించారు. ఆర్థిక అసమానతలు.వాస్తవానికి, ప్రభుత్వం వద్ద ఎటువంటి డేటా లేదని, ఎన్డీయే అంటే ''నో డేటా అవైలబుల్'' అని సెటైర్లు వేశారు. జనగణన, ఉపాధి డేలా, ఆరోగ్య సర్వే వంటి గణాంకాలను బీజేపీ ప్రభుత్వం దాచిపెడుతోందని, మోడీ ప్రభుత్వం అబద్దాలను మాత్రమే ప్రచారం చేస్తోందని ఖర్గే మండిపడ్డారు. రాజ్యాంగంపై నమ్మకం లేని వారు, దండి మార్చ్‌, క్విట్‌ ఇండియా ఉద్యమంలో పాల్గొనని వారు నేడు కాంగ్రెస్‌ పార్టీకి దేశభక్తిని ప్రబోధించే సాహసం చేస్తున్నారని అన్నారు. యూపీఏ హయాంలో నిరుద్యోగం 2.2 శాతం ఉంటే, మీ హయాంలో 45 ఏళ్లలో గరిష్ట స్థాయికి ఎందుకు వచ్చిందని ప్రశ్నించారు. 10 ఏళ్ల యూపీఏ హయాంలో సగటు జీడీపీ వృద్ధిరేటు 8.13 శాతంగా ఉందని, ప్రస్తుత ప్రభుత్వ హయాంలో 5.6 శాతం మాత్రమే ఎందుకు ఉందన్నారు. వరల్డ్ బ్యాంక్ ప్రకారం భారత్ 2011లోనే ప్రపంచ మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరించిందని చెప్పారు. ఆధార్-డీబీటీని ప్రారంభించింది యూపీయే అని చెప్పారు. గత 10 ఏళ్లలో మన ఎగుమతులు, దిగుమతుల మధ్య అంతరం మూడు రెట్లు పెరిగిందని, ఈ వాస్తవం తెలిసినా ప్రభుత్వం సమస్యగా భావించకుండా, దిద్దుబాటు చర్యలు చేపట్టకపోవడం విచారకరమన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)