వీఆర్‌ఏల అంశంపై అధ్యయనానికి ఐదుగురు సభ్యులతో కమిటీ !

Telugu Lo Computer
0


తెలంగాణలో వీఆర్‌ఏలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు సభ్యులతో కమిటీని ఏర్పాటు చేసింది. రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి, ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి లేదా ఆయన నియమించిన అధికారి, జీఏడీ కార్యదర్శి, రంగారెడ్డి జిల్లా కలెక్టర్ సభ్యులుగా సీసీఎల్ఏ కార్యదర్శి కమిటీ కన్వీనర్‌గా ఉన్నారు. వీఆర్ఏల అంశంపై వీలైనంత త్వరగా సిఫార్సులు ఇవ్వాలని ప్రభుత్వం సూచించింది. వీఆర్ఏ వ్యవస్థ పునరుద్ధరణ, ఇతర విభాగాల్లో సర్వీసుల పునరుద్ధరణ, చట్టపరిమితి, న్యాయవివాదాలు తదితర అంశాలను ఈ కమిటీ పరిశీలించనుంది. ఈ మేరకు రెవెన్యూ శాఖ కార్యదర్శి నవీన్ మిత్తల్ ఉత్తర్వులు జారీ చేశారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)