ఉక్రెయిన్‌ను చర్చలకు పిలవండి !

Telugu Lo Computer
0


క్రెయిన్‌ను చర్చలకు వచ్చేలా చర్యలు చేపట్టాలని అమెరికాను రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్  కోరారు. ఫాక్స్ న్యూస్ జర్నలిస్టు టక్కర్ కార్లసన్‌తో జరిగిన ఇంటర్వ్యూలో పుతిన్ ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్టర్ ఇవాన్ గ్రెషక్కోవిచ్‌ను అప్పగింతకు సంబంధించిన అంశంలోనూ చర్చకు తాము సిద్ధంగా ఉన్నట్లు పుతిన్ తెలిపారు. ఆ రిపోర్టర్ దేశద్రోహానికి పాల్పడినట్లు రష్యా ఆరోపిస్తున్నది. అయితే అతన్ని వదిలేయాలంటే, జర్మనీలో ఉన్న తమ ఏజెంట్‌ను విడిపించాలని పుతిన్ అమెరికాను కోరారు. ఉక్రెయిన్‌తో యుద్ధం ప్రారంభమై రెండున్నరేళ్లు అవుతోంది. ఉక్రెయిన్‌లో ఉన్న రష్యన్ జాతీయుల్ని కాపాడుకునేందుకు యుద్ధం చేయాల్సి వస్తోందన్నారు. నాటోలో ఉక్రెయిన్ చేరకుండా ఉండేందుకు కూడా ఆ యుద్ధం అవసరమని పుతిన్ పేర్కొన్నారు. తమతో చర్చలు నిర్వహించేందుకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ సుముఖంగా లేరని, ఆయన్ను చర్చలకు వచ్చేలా అమెరికా చర్యలు చేపట్టాలని పుతిన్ కోరారు. ఉక్రెయిన్‌కు ఆయుధాల సరఫరాను నిలిపివేసి, ఆ దేశాన్ని చర్చల వైపు మళ్లించాలని తెలిపారు. తాము ఎప్పుడూ చర్చలను వ్యతిరేకించలేదన్నారు. ఉక్రెయిన్‌కు అండగా ఉంటూ రష్యా దెబ్బతీయాలనుకుంటున్న పశ్చిమ దేశాల ప్లాన్ ఎప్పటికీ వర్కౌట్ కాదన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)