విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్‌కు విమానాలు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని విశాఖపట్నం నుంచి బ్యాంకాక్, కౌలాలంపూర్ కు ఏప్రిల్ నుంచి ఎయిరేషియా విమాన సేవలు ప్రారంభం కానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-బ్యాంకాక్ విమాన సర్వీసులు మొదలవుతాయి. ఏప్రిల్ 26 నుంచి విశాఖ-కౌలాలంపూర్ కు విమాన సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఏప్రిల్ 9 నుంచి విశాఖ-హైదరాబాద్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు నడవనుంది. మే, జూన్ లో విశాఖ-దుబాయ్ మధ్య మరో ఎయిరిండియా సర్వీసు మొదలవుతుంది. ఈ నేపథ్యంలో విశాఖ ఎయిర్‌పోర్ట్ రన్‌వే నవీకరణ పనులు మార్చి 31 నాటికి పూర్తికానున్నాయి. ఏప్రిల్ నుంచి పూర్తిస్థాయిలో విశాఖ ఎయిర్‌పోర్ట్ నుంచి విమానాల రాకపోకలు ప్రారంభమవుతాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)