కింగ్‌ చార్లెస్‌కి కేన్సర్‌ ?

Telugu Lo Computer
0


బ్రిటన్‌ రాజు కింగ్‌ చార్లెస్‌ III కేన్సర్‌తో బాధపడుతున్న బకింగ్‌హామ్‌ ప్యాలెస్‌ పేర్కొంది. ఆయన గత నెలలో ఆరోగ్య సమస్యతో ఆస్పత్రికి వెళ్లగా కేన్సర్‌గా నిర్దారణ అయినట్లు తెలిపింది. అయితే అది ఏ రకమైన కేన్సర్‌ అనేది వెల్లడించలేదు. సోమవారం నుంచి చికిత్స మొదలైందని, కాబట్టి కొద్ది రోజు ప్రజావిధుల నుంఇచ తప్పుకుంటారని పేర్కొంది. ఇక బ్రిటిఫ్‌ ప్రెస్‌ ప్రకారం ఆయన కెరిర్‌లో కొన్ని గాయాలు, రెండుసార్లు కరోనా మహమ్మారి బారిని పడటం మినహా రాజ అద్భుతమైన ఆరోగ్యకరమ జీవితాన్నే గడిపారు. ఆయన చక్రవర్తిగా 2022లో సింహాసనాన్ని అధిరోహించిన సంగతి తెలిసిందే. పైగా బ్రిటిష్‌ చరిత్రలో రాజుగా పట్టాభిషేకం అయిన అంత పెద్ద వయసు వ్యక్తి కూడా ఆయనే. ఇక ఆయన లైఫ్‌స్టైల్‌ విషయానికి వస్తే.. ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరిస్తారని అంతరంగికులు చెబుతున్నారు. అందులోనూ ఆయన ఆరోగ్యానికి అత్యంత ప్రాముఖ్యత ఇస్తారని అంటునన్నారు. అలాంటి ఆయన ఈ కేన్సర్‌ మహమ్మారిన బారిన పడటం అందర్నీ దిగ్బ్రాంతికి గురి చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)