ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌పీసీఐ ప్రతినిధులతో ఆర్‌బీఐ భేటీ ?

Telugu Lo Computer
0


ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎం సంక్షోభం నుంచి వినియోగదారులను సురక్షితంగా ఉంచేందుకు ఆర్‌బీఐ సిద్ధమైంది. ఇందులో భాగంగా వచ్చే వారం నేషనల్‌ హైవే అథారిటీ (ఎన్‌హెచ్‌ఏఐ), కార్పొరేషన్‌ ఆఫ్‌ ఇండియా (ఎన్‌పీసీఐ) ప్రతినిధులతో భేటీ కానుంది. ఈ సమావేశంలో పేటీఎంపై విధించిన ఆంక్షల నేపథ్యంలో ఆ సంస్థ యూజర్ల భద్రతపై కీలక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఈ భేటీలో యూనిఫైడ్‌ పేమెంట్‌ ఇంటర్‌ ఫేస్‌(యూపీఐ) ద్వారా ఫాస్టాగ్‌ వ్యవస్థని నిర్వహిస్తున్న నేషనల్‌ హైవేస్‌ అథారిటీ ఆఫ్‌ ఇండియా (ఎన్‌హెచ్‌ఏఐ)తో పాటు ఇతర వాటాదారులు ఆర్‌బీఐ అధ్యక్షతన జరిగే సమావేశానికి హాజరుకానున్నారు. పేటీఎంపై ఆర్‌బీఐ గత వారం ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలపై పేటీఎం యూజర్లు ఫాస్టాగ్‌ గురించి, ఇతర చెల్లింపులు గురించి ఆర్‌బీఐని ప్రశ్నించారు. ఆ ప్రశ్నలన్నింటికి ఆర్‌బీఐ వచ్చే వారం ఎన్‌హెచ్‌ఏఐ, ఎన్‌సీపీఐతో భేటీ అనంతరం వివరణ ఇవ్వనున్నట్లు పలు నివేదికలు వెలుగులోకి వచ్చాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)