ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం !

Telugu Lo Computer
0


కేంద్ర ప్రభుత్వం తీసకువచ్చిన ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన పథకం వార్షిక ప్రీమియం కేవలం రూ. 436. నెలవారీగా చూస్తే కేవలం రూ.36 మాత్రమే ఉంటుంది. ప్రజలకు అతి తక్కువ ఖర్చుతో జీవిత బీమా కవరేజీని అందించడమే ఈ పథకం లక్ష్యం. అయితే ఈ పథకాన్ని ప్రారంభించినప్పుడు కేవలం రూ.330 ప్రీమియంతోనే పాలసీని అందించేవారు. ఇప్పుడు ఆ ప్రీమియంను రూ.436కు పెంచారు. ఈ పథకం బీమా చేసిన వ్యక్తి మరణిస్తే కుటుంబానికి రూ. 2 లక్షల వరకు ఆర్థిక సహాయం కేంద్ర ప్రభుత్వం అందిస్తుంది. ఈ పాలసీని కొనుగోలు చేయడానికి కనీస వయస్సు 18 సంవత్సరాలు. గరిష్ట వయస్సు 55 సంవత్సరాలుగా నిర్ణయించారు. ఈ పథకాలు జూన్ 1 నుంచి మే 31 మధ్య ప్రాతిపదికన అమలవుతుంది. అయితే ఈ స్కీమ్‌ల ప్రయోజనాలను పొందాలంటే బ్యాంకు అకౌంట్ ఉండతం తప్పనిసరి. ప్రీమియం చెల్లించే సమయంలో బ్యాంక్ ఖాతా మూసివేయడం లేదా ఖాతాలో తగినంత బ్యాలెన్స్ లేకపోతే బీమా రద్దు చేయవచ్చు. ప్రధాన మంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన (పీఎంజేజేబీవై) ఒక సంవత్సరం పాటు జీవిత బీమా కవరేజీతో ఉంటుంది. దీన్ని ప్రతి సంవత్సరం రెన్యూవల్ చేసుకోవాలి. ఇందులో ఏ కారణం చేతనైనా మరణిస్తే జీవిత బీమా సౌకర్యం లభిస్తుంది. ఏదైనా కారణం వల్ల బీమా చేసిన వ్యక్తి మరణిస్తే అతని నామినీకి రూ. 2 లక్షలు అందుతాయి. ఈ పాలసీ తీసుకోవడానికి మీకు ఎలాంటి వైద్య పరీక్షలు అవసరం లేదు. బీమా పాలసీ సమ్మతి లేఖలో కొన్ని నిర్దిష్ట వ్యాధులు పేర్కొన్నారు. మీరు ఆ వ్యాధులతో బాధపడటం లేదని డిక్లరేషన్‌లో ప్రకటించాలి.


Post a Comment

0Comments

Post a Comment (0)