ఐసీసీ అవార్డు గెలుచుకున్న షమార్‌ జోసఫ్‌

Telugu Lo Computer
0


విండీస్‌ ఫాస్ట్‌ బౌలర్‌ షమార్‌ జోసఫ్‌ ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు (2024 జనవరి) దక్కించుకున్నాడు. గత నెలలో అత్యుత్తమ ప్రదర్శన కనబర్చినందుకుగాను షమార్‌ ఈ అవార్డు గెలుచుకున్నాడు. ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు కోసం ఆస్ట్రేలియా పేసర్‌ జోష్‌ హాజిల్‌వుడ్‌, ఇంగ్లండ్‌ బ్యాటర్‌ ఓలీ పోప్‌ పోటీపడినప్పటికీ.. విండీస్‌ సంచలన బౌలర్‌నే అవార్డు వరించింది. వివిధ పద్దతుల్లో జరిగిన ఓటింగ్‌లో అత్యధిక శాతం ఓట్లు షమార్‌కే దక్కాయి. మహిళల విభాగంలో జనవరి నెల ఐసీసీ ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డును అమీ హంటర్(ఐర్లాండ్) దక్కించుకుంది. గత నెలలో అద్భుత ప్రదర్శనల నేపథ్యంలో అమీ హంటర్‌ ఈ అవార్డుకు ఎంపికైంది. అమీతో పాటు ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు కోసం బెత్ మూనీ(ఆస్ట్రేలియా), అలీసా హేలీ(ఆస్ట్రేలియా) పోటీపడ్డారు. షమార్‌ జోసఫ్‌ గత నెలలో ఆస్ట్రేలియాతో జరిగిన తొలి టెస్ట్‌ ద్వారా అంతర్జాతీయ అరంగేట్రం చేశాడు. ఈ విండీస్‌ యువ పేసర్‌ తన తొలి పర్యటనలోనే సంచలన ప్రదర్శనలు నమోదు చేసి ప్లేయర్‌ ఆఫ్‌ ద మంత్‌ అవార్డు గెలుచుకున్నాడు. ఈ పర్యటనలో ఆసీస్‌ బ్యాటర్లను గడగడలాడించిన షమార్‌ రెండు మ్యాచ్‌ల్లో 13 వికెట్లు తీశాడు. ఇందులో రెండు ఐదు వికెట్ల ప్రదర్శనలు ఉన్నాయి. గబ్బా టెస్ట్‌ సెకెండ్‌ ఇన్నింగ్స్‌లో షమార్‌ విశ్వరూపం​ (7-68) ప్రదర్శించడంతో పర్యాటక విండీస్‌ 30 ఏళ్ల తర్వాత ఆసీస్‌ గడ్డపై టెస్ట్‌ విజయాన్ని నమోదు చేసింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)