బ్యాంకు క్యాషియర్‌ మెడపై కొడవలి పెట్టి బెదిరించి డబ్బుతో పరార్‌ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్‌లోని గోండాలో శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు తలకు హెల్మెట్‌ ధరించిన ఒక వ్యక్తి వీఐపీ ప్రాంతంలోని ప్రథమ యూపీ గ్రామీణ బ్యాంకు సివిల్‌లైన్‌ బ్రాంచ్‌లోకి ప్రవేశించాడు. బ్యాంకులో ఉన్న కస్టమర్లు వెళ్లేంత వరకు అక్కడ వేచి ఉన్నాడు. ఆ తర్వాత క్యాష్‌ కౌంటర్‌ వద్దకు వెళ్లాడు. ఆ చాంబర్‌ డోర్‌ తోసి అందులోకి ప్రవేశించాడు. వెంట తెచ్చిన కొడవలిని మహిళా క్యాషియర్‌ మెడ వద్ద ఉంచి బెదిరించాడు. తన బ్యాగులో డబ్బులు కట్టలు వేయాలని ఆమెకు చెప్పాడు. ఆ మహిళా క్యాషియర్‌ అతడు చెప్పినట్లు చేసింది. దీంతో రూ.8.53 లక్షల నగదుతో అక్కడి నుంచి పారిపోయాడు. ఆ బ్యాంకు మేనేజర్‌ ఈ విషయాన్ని వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో వారు ఆ బ్యాంకు వద్దకు చేరుకున్నారు. బ్యాంకులో ఉన్న సీసీటీవీల ఫుటేజ్‌ను పరిశీలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డబ్బుతో పారిపోయిన నిందితుడ్ని గుర్తించి అరెస్ట్‌ చేసేందుకు పోలీస్ బృందాలను ఏర్పాటు చేశారు. మరోవైపు సీసీటీవీలో రికార్డైన ఈ వీడియో క్లిప్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అయ్యింది.

Post a Comment

0Comments

Post a Comment (0)