కేబీఆర్ పార్కు వాకర్స్ కు మెట్రో రాయితీ ఆఫర్!

Telugu Lo Computer
0


హైదరాబాద్ కేబీఆర్ పార్కులో వాకింగ్ కు వెళ్లే వారి కోసం ఎల్ అండ్ టీ మెట్రో ప్రత్యేక ఆఫర్ ప్రకటించింది. ఉదయం 6 నుంచి 8 గంటల మధ్య, రాత్రి 8 నుంచి 11.59 గంటల మధ్య మెట్రోలో ప్రయాణించే వారికి స్మార్ట్ కార్డ్‌పై 10 శాతం తగ్గింపును ప్రకటించింది. నగరంలో ఎక్కడి నుంచైనా మెట్రోలో ప్రయాణించి జూబ్లీహిల్స్ చెక్‌పోస్టు వద్ద దిగే వారికి సూపర్ ఆవర్స్‌లో ఈ రాయితీ ఇస్తున్నట్లు మెట్రో అధికారులు తెలిపారు. కేబీఆర్‌లోని పార్కులో ఉదయం, రాత్రి వేళల్లో వాకింగ్ చేసే వారికి ఈ ఆఫర్ ప్రత్యేకంగా వర్తిస్తుంది. చాలా మంది వాకింగ్ కు కేబీఆర్ వస్తుంటారని దీంతో ఈ ఆఫర్ ఉపయోగించుకోవాలని మెట్రో అధికారులు సూచించారు. అంతేకాకుండా  ట్రాఫిక్ నియంత్రణ తగ్గించేందుకు ఆఫర్ ప్రకటించామని తెలిపింది. వాకర్స్ చాలా మంది కార్లు వేసుకుని వస్తుంటారని దాని వల్ల ఎక్కడ పార్కింగ్ చేయాలో సతమతమౌతుంటారని తెలిపారు. కాబట్టి కార్లు ఉపయోగించుకోకుండా వాకర్స్ అందరూ మెట్రోను ఉపయోగించుకోవాలని సూచించారు. దీంతో ట్రాఫిక్ కు అంతరాయం ఉండదని తెలిపారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)