శ్రీకాళహస్తి ఆలయంలో అర్ధరాత్రి కలకలం !

Telugu Lo Computer
0


శ్రీకాళహస్తీ ఆలయంలో అర్ధరాత్రి కలకలం రేగింది.. ఓ బాలుడు అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన ఘటన రచ్చగా మారింది.. ఆలయం మూసివేసిన తరువాత 13 సంవత్సరాల వయసులో ఉన్న మైనర్ బాలుడు ఆలయ ప్రహరీ గోడ నుండి నిచ్చెన ద్వారా ఆలయంలోకి ప్రేవేశించాడు.. తిరిగి అదే గోడ దూకుతుండగా కార్ పార్కింగ్ వద్ద బాలుడ్ని గుర్తించి భక్తులు అధికారులకు సమాచారం ఇచ్చారు. ఆలయ సీసీ కెమెరాలో సైతం బాలుడు ఆలయంలో తిరుగుతున్న దృశ్యాలు రికార్డు అయ్యాయి.. ఆ దృశ్యాలను చూసి కంగుతిన్నారు ఆలయ భద్రతా సిబ్బంది. అసలు ఆ బాలుడు ఎలా ఆలయంలోకి వచ్చాడు..? ఎందుకు వచ్చాడు..? అని ఆరా తీస్తున్నారు భద్రత సిబ్బంది. అయితే, ఈ విషయాన్ని గోప్యంగా ఉంచి బాలుడుకి మతిస్థిమితం లేకపోవడంతోనే అలా చేశారంటూన్నారు ఆలయ భద్రతా సిబ్బంది. అయితే, ఆలయ అధికారులు అధికారుల సమాధానంపై  భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో సైతం విగ్రహాలు ఎత్తుకుపోవడం, క్షుద్రపూజలు లాంటి ఘటన జరిగినా అధికారుల్లో ఇప్పటికీ మార్పు రావడంలేదంటూ స్థానికులు, భక్తులు మండిపడుతున్నారు.. అసలు ఆ బాలుడు ఎందుకు ఆలయంలోకి వచ్చాడనే విషయం విచారణలో తేల్చేపనిలో పడిపోయారు ఆలయ సిబ్బంది, అధికారులు. 

Post a Comment

0Comments

Post a Comment (0)