31 ఎంక్యూ-9బీ డ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం !

Telugu Lo Computer
0


భారత్‌కు 31 'ఎంక్యూ-9బీ' రకం సాయుధ డ్రోన్ల విక్రయానికి అమెరికా ఆమోదం తెలిపింది. దాదాపు రూ.33 వేల కోట్ల ప్రతిపాదిత ఒప్పందానికి ఆమోద ముద్ర వేసింది. గతేడాది జూన్‌లో ప్రధాని నరేంద్ర మోడీ అమెరికా పర్యటన సందర్భంగా ఈ డ్రోన్ల ఒప్పందాన్ని ప్రకటించారు. ''రూ.33 వేల కోట్ల అంచనా వ్యయంతో ఎంక్యూ-9బీ డ్రోన్లు, సంబంధిత పరికరాలను భారత్‌కు విక్రయించేందుకు ఆమోదం తెలుపుతూ విదేశాంగ శాఖ నిర్ణయం తీసుకుంది'' అని అమెరికా డిఫెన్స్ సెక్యూరిటీ కోఆపరేషన్ ఏజెన్సీ ఓ ప్రకటనలో తెలిపింది. ''ఈ ప్రతిపాదిత విక్రయం.. అమెరికా- భారత్‌ల మధ్య వ్యూహాత్మక సంబంధాన్ని బలోపేతం చేస్తుంది. ఇండో-పసిఫిక్‌, దక్షిణాసియాలో మా ప్రధాన రక్షణ భాగస్వామి భద్రతను మెరుగుపరచడానికి సాయం చేస్తుంది'' అని అమెరికా ఏజెన్సీ పేర్కొంది. చట్టసభకు ఈ విషయం తెలియజేసేందుకు అవసరమైన పత్రాలను అందజేసినట్లు తెలిపింది. ఈ ఒప్పందం కింద.. భారత్‌కు అగ్రరాజ్యం 31 డ్రోన్లు విక్రయించనుంది. వీటిలో 15 సీగార్డియన్ రకం డ్రోన్లను నౌకాదళానికి కేటాయించనున్నారు. ఆర్మీ, వాయుసేనకు ఎనిమిది చొప్పున స్కైగార్డియన్‌ డ్రోన్లు అప్పగించనున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)