అండర్‌ 19 ప్రపంచకప్‌ విజేతగా ఆస్ట్రేలియా !

Telugu Lo Computer
0


నేడు జరిగిన అండర్‌ 19 ప్రపంచకప్‌ ఫైనల్‌ లో భారత్‌ పరాజయం పాలైంది. ఆస్ట్రేలియా విధించిన 254 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక యంగ్‌ టీమిండియా చతికిలపడింది. 43.5 ఓవర్లలో 174 పరుగులకు కుప్పకూలింది. దీంతో ఆరోసారి విశ్వవిజేతగా నిలవాలన్న టీమిండియా కల నెరవేరలేదు. టోర్నీలో నిలకడగా రాణించిన ఆసీస్‌ ఫైనల్‌ లో భారత్‌ ను చిత్తు చేసి మరోసారి ప్రపంచకప్‌ టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. గతేడాది నవంబర్‌ 19న వన్డే ప్రపంచకప్‌ ఫైనల్‌లో ఆస్ట్రేలియా చేతిలో సీనియర్‌ ఆటగాళ్ల ఓటమికి ప్రతీకారం తీర్చుకుంటారనుకుంటే.. కుర్రాళ్లూ కూడా క్రికెట్ అభిమానులకు నిరాశే మిగిల్చారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)